RTC బస్సులో ఫ్యామిలీతో సజ్జనార్‌ సందడే సందడి.. వీడియో అదుర్స్‌!

పోలీస్‌ శాఖలో తనదైన ముద్ర వేసిన ఐపీఎస్‌ అధికారి వీసీ సజ్జనార్‌ ఆర్టీసీ ఎండీగానూ తన ప్రత్యేకతను చాటుకొంటున్నారు. తెలంగాణ ఆర్టీసీని పరుగులు పెట్టించేందుకు.....

Published : 30 Nov 2021 01:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పోలీస్‌ శాఖలో తనదైన ముద్ర వేసిన ఐపీఎస్‌ అధికారి వీసీ సజ్జనార్‌ ఆర్టీసీ ఎండీగానూ తన ప్రత్యేకతను చాటుకొంటున్నారు. తెలంగాణ ఆర్టీసీని ప్రయాణికులకు మరింత చేరువ చేసేందుకు అనేక వినూత్న ప్రయోగాలతో తన మార్క్‌ను చూపిస్తున్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా ప్రజల్ని ఆకర్షించే కృషిలో ఆయన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. పలు సందర్భాల్లో ఓ సాధారణ ప్రయాణికుడిలా స్వయంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన సజ్జనార్‌.. తోటి ప్రయాణికుల సమస్యల్ని తెలుసుకొని పరిష్కారానికి కృషిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా సజ్జనార్‌ తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సపరివార కుటుంబ సమేతంగా బస్సులో సందడి చేశారు. టీఎస్‌ ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, సుఖమయం, శుభప్రదం అని ప్రయాణికులకు వివరించేలా రూపొందించిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను సాయితేజ అనే సామాజిక కార్యకర్త ట్విటర్‌లో పోస్ట్ చేయగా.. దాన్ని సజ్జనార్‌ రీట్వీట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని