తులిప్‌ అందాలు.. పర్యాటకుల ఆనందాలు

బ్రిటన్‌లోని తులిప్‌ ఉద్యానవనాలు ప్రకృతి ప్రేమికులకు ఆహ్వానం పలుకుతున్నాయి. కరోనా ఆంక్షలు సడలించడంతో ఈ పూల వనాలను సందర్శించేందుకు పర్యాటకులు ఉత్సాహం చూపిస్తున్నారు. లాంక్‌షైర్‌లోని పలు ఉద్యానవనాలు రంగురంగుల పుష్పాలతో కనువిందు చేస్తున్నాయి....

Published : 17 Apr 2021 01:49 IST

లాంక్‌షైర్‌: బ్రిటన్‌లోని తులిప్‌ ఉద్యానవనాలు ప్రకృతి ప్రేమికులకు ఆహ్వానం పలుకుతున్నాయి. లాంక్‌షైర్‌లోని పలు ఉద్యానవనాలు రంగురంగుల పుష్పాలతో కనువిందు చేస్తున్నాయి. తులిప్‌ పుష్ప పరిశ్రమకు కేంద్రంగా ఉన్న లాంక్‌షైర్‌లో వార్షిక వేడుకలు ప్రారంభం కావడంతో వీటిని చూసేందుకు సందర్శకులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఉద్యానవనాల్లో తిరుగుతూ పూల సుమగంధాలను ఆస్వాదిస్తున్నారు.

80 వేల పూల మొక్కలతో స్ప్రింగ్‌ఫీల్డ్‌ ఉద్యానవనం సందర్శకులకు కనువిందు చేస్తోంది. ఈ పూల వనంలో దాదాపు 80 రకాల పూల మొక్కలు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏటా అక్టోబర్‌, నవంబర్‌ మధ్య తులిప్‌ మొక్కలను నాటుతారు. మార్చి నాటికి ఇవి పుష్పించడం ప్రారంభిస్తాయి. అయితే ఈ ఏడాది తులిప్‌ పూలు సీజన్‌ కంటే ముందుగానే పూశాయి. దాదాపు 60 శాతం రేకులు విప్పుకొన్నాయి. వచ్చే నెల వరకు అన్ని పూలు వికసిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని