Updated : 13/04/2021 17:28 IST

ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం సీఎం జగన్‌ పండితులను సత్కరించారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్‌ వ్యవసాయ పంచాంగం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘ ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడాలి. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలి. కరోనా పీడ శాశ్వతంగా విరగడ కావాలి’’ అని ఆకాంక్షించారు.   


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని