UGC: విద్యార్థులకు యూజీసీ స్కాలర్‌షిప్‌ స్కీమ్స్‌!

కాలేజ్‌, యూనివర్సిటీ విద్యార్థుల కోసం యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌(యూజీసీ) నాలుగు స్కాలర్‌షిప్‌ స్కీమ్స్‌ను ప్రకటించింది. ఆసక్తి ఉన్న విద్యార్థులు స్కాలర్‌షిప్‌ కోసం నవంబర్‌ 30లోపు అధికారిక వెబ్‌సైట్‌  scholarships.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు బహిరంగ ప్రకటన విడుదల చేసింది. 2021-22 విద్యా సంవత్సరానికిగానూ

Updated : 24 Nov 2021 04:34 IST

దిల్లీ: కాలేజ్‌, యూనివర్సిటీ విద్యార్థుల కోసం యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌(యూజీసీ) నాలుగు స్కాలర్‌షిప్‌ పథకాలను ప్రకటించింది. ఆసక్తి ఉన్న విద్యార్థులు స్కాలర్‌షిప్‌ కోసం నవంబర్‌ 30లోపు అధికారిక వెబ్‌సైట్‌  scholarships.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు బహిరంగ ప్రకటన విడుదల చేసింది. 2021-22 విద్యా సంవత్సరానికిగానూ ఇందిరా గాంధీ పీజీ స్కాలర్‌షిప్‌ ఫర్‌ సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌, పీజీ స్కాలర్‌షిప్‌ ఫర్‌ యూనివర్సిటీ ర్యాంక్‌ హోల్డర్స్‌ క్యాండిడేట్స్‌, ఇషాన్‌ ఉదయ్‌ స్పెషల్‌ స్కాలర్‌షిప్‌ ఫర్‌ నార్త్‌ ఈస్టర్న్‌ రీజియన్‌, పీజీ స్కాలర్‌షిప్‌ ప్రొఫెషనల్‌ కోర్సెస్‌ ఫర్‌ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌ స్కీమ్స్‌ కింద స్కాలర్‌షిప్‌ ఇవ్వనున్నట్లు యూజీసీ వెల్లడించింది. నవంబర్‌ 30లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఆయా కాలేజీలు, యూనివర్సిటీలు దరఖాస్తులను ధ్రువీకరించడం.. పొరపాట్లు దిద్ది తిరిగి దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్‌ 15వ తేదీ తుది గడువుగా నిర్ణయించినట్లు యూజీసీ పేర్కొంది.  

స్కాలర్‌షిప్‌ వివరాలు..

* ఇందిరా గాంధీ పీజీ స్కాలర్‌షిప్‌ ఫర్‌ సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ - ఏడాదికి రూ. 36,200 చొప్పున రెండేళ్లు.

* పీజీ స్కాలర్‌షిప్‌ ఫర్‌ యూనివర్సిటీ ర్యాంక్‌ హోల్డర్స్‌ క్యాండిడేట్స్‌ - నెలకు రూ. 3,100 చొప్పున రెండేళ్లు.

* ఇషాన్‌ ఉదయ్‌ స్పెషల్‌ స్కాలర్‌షిప్‌ ఫర్‌ నార్త్‌ ఈస్టర్న్‌ రీజియన్‌ - నెలకు రూ. 5,400(సాధారణ డిగ్రీకి), రూ. 7,800(ప్రొఫెషనల్‌ కోర్సులకు)

* పీజీ స్కాలర్‌షిప్‌ ప్రొఫెషనల్‌ కోర్సెస్‌ ఫర్‌ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌ - నెలకు రూ. 7,800 (ఎం.ఈ, ఎం.టెక్‌ కోర్సులకు), రూ. 4,500 (ఇతర పీజీ కోర్సులకు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని