Updated : 16/06/2021 11:04 IST

యూనివర్సిటీలో కర్రాబిళ్ల.. తొక్కుడు బిళ్ల.. గోలీలాట!

లఖ్‌నవూ: కర్రాబిళ్ల.. తొక్కుడు బిళ్ల.. గోలీలాట. పేర్లు చదవగానే చిన్నతనంలో మీరు ఆడుకున్న సందర్భాలు గుర్తొచ్చాయా? స్కూల్‌ నుంచి ఇంటికి రాగానే స్నేహితులతో సరదాగా ఆడుకున్న సంప్రదాయ ఆటలవీ. కానీ, ఈ మిలీనియమ్‌ పిల్లలకు వీటి గురించి ఏమాత్రం తెలియదు. ఇప్పుడందరూ మొబైల్‌ ఫోన్‌, ప్లే స్టేషన్‌ అంటూ డిజిటల్‌ గేమ్స్‌ మాత్రమే ఆడుతున్నారు. అయితే, తిరిగి ఆ సంప్రదాయ ఆటలకు జీవం పోసేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ యూనివర్సిటీ శ్రీకారం చుట్టింది.

మేరఠ్‌లోని చౌదరీ చరణ్‌ సింగ్‌ యూనివర్సిటీ(సీసీఎస్‌యూ)లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులో రెగ్యులర్‌గా నేర్పించే వాలీబాల్‌, రెజ్లింగ్‌, స్విమ్మింగ్‌, క్రికెట్‌, బాస్కెట్‌బాల్‌తోపాటు కర్రాబిళ్ల, గోలీలాట, తొక్కుడు బిళ్ల ఆటలను కూడా చేర్చింది. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ-2020లో భాగంగానే ‘ది ట్రెడిషనల్‌ గేమ్స్‌ ఆఫ్ ఇండియా’ పేరుతో ఈ ఆటలను ప్రవేశపెడుతున్నామని యూనివర్సిటీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ విధంగానైనా మన సంప్రదాయ ఆటలకు ఒక గుర్తింపు లభిస్తుందని వర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కేకే పాండే తెలిపారు. ‘‘మనం చిన్నప్పుడు ఎంతో ఇష్టపడి ఆడుకున్న ఆటలు ఇప్పుడు ఉనికిని కోల్పోతున్నాయి. తిరిగి వాటిని సమాజంలోకి తీసుకురావాలనేదే మా ప్రయత్నం. ఈ కొత్త కోర్సు నేర్చుకునే ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్ట్రక్టర్లు భవిష్యత్తులో పాఠశాలల్లో పీఈటీలుగా చేరినప్పుడు పిల్లలతో ఈ ఆటలను ఆడించే అవకాశముంటుంది. ఈ ఆటలు కేవలం వినోదాన్నే కాదు.. శారీరక దృఢత్వాన్ని ఇస్తాయి. విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంచుతాయి’’అని చెప్పారు.

యూపీలోని లఖ్‌నవూ యూనివర్సిటీ కూడా గతేడాది విభిన్న కోర్సును ప్రవేశపెట్టింది. ఎం.ఎడ్‌ కోర్సులో ‘ఎడ్యుకేషన్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌’ పేరుతో పాఠ్యాంశాన్ని చేర్చింది. ఈ పాఠ్యాంశం ద్వారా అసలైన ఆనందం అంటే ఏంటి? అనే విషయాన్ని బోధిస్తున్నారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని