Rajasthan: టీకా వేస్తే పాముతో కరిపిస్తా..!

రాజస్థాన్‌లో టీకా వేసేందుకు వెళ్లిన వైద్య సిబ్బందిని ఓ మహిళ బుసలు కొడుతున్న పాముతో భయపెట్టింది. అజ్మేర్‌ జిల్లా నాగెలావ్‌ గ్రామంలో.....

Published : 18 Oct 2021 01:27 IST

అజ్మేర్‌: కరోనా టీకా ప్రతి ఒక్కరికీ చేరేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్న వేళ.. పలు చోట్ల ప్రజల్లో ఇంకా వ్యాక్సిన్‌పై భయం వీడటం లేదు. టీకా వేసేందుకు గ్రామాల్లోకి వెళ్లిన వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా టీకా వేసేందుకు వెళ్లిన వైద్య సిబ్బందిని ఓ మహిళ బుసలు కొడుతున్న పాముతో భయపెట్టింది. రాజస్థాన్‌లోని అజ్మేర్‌ జిల్లా నాగెలావ్‌ గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ వైద్య సిబ్బంది టీకాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటికి వెళ్లిన సిబ్బందికి షాక్‌ తగిలింది. తనకు వ్యాక్సిన్‌ వేస్తే పాముతో కరిపిస్తానంటూ బుసలు కొడుతున్న ఓ నాగుపామును వారికి చూపించి ఓ మహిళ బెదిరింపులకు పాల్పడింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాములు ఆడించుకునే తెగకు చెందిన కమలా దేవి చర్యతో వైద్య సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అయినప్పటికీ బెదరని వారు కమలాదేవికి స్థానికులతో కలిసి కౌన్సెలింగ్ ఇచ్చారు. కౌన్సెలింగ్‌ అనంతరం ఆ మహిళ ఒప్పుకోవడంతో ఆమెతోపాటు అక్కడ ఉన్న దాదాపు మరో 20 మందికి టీకాలు వేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని