ఇస్రోపై ప్రముఖుల ప్రశంసల వెల్లువ

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సి-51 రాకెట్‌ ప్రయోగం విజయవంతంపై పలువురు ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. రాకెట్‌ ప్రయోగం విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన శాస్త్రవేత్తలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా తెలుగు ..

Updated : 28 Feb 2021 15:57 IST

హైదరాబాద్‌: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సి-51 రాకెట్‌ ప్రయోగం విజయవంతంపై పలువురు ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. రాకెట్‌ ప్రయోగం విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన శాస్త్రవేత్తలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభినందించారు. పీఎస్‌ఎల్‌వీ-సీ51 ప్రయోగం విజయవంతం కావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వెంకయ్యనాయుడు అన్నారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. 

ఇస్రో ద్వారా దేశ ఖ్యాతి వర్ధిల్లుతోంది: కేసీఆర్‌

పీఎస్‌ఎల్‌వీ-సీ51 ప్రయోగం విజయవంతంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రయోగంలో కీలకంగా వ్యవహరించిన శాస్త్రవేత్తలు, సాంకేతిక సిబ్బందిని అభినందించారు. అగ్రశ్రేణి అంతరిక్ష పరిశోధన సంస్థగా ఇస్రో మరోసారి నిలిచిందని కొనియాడారు. పలు దేశాలు ఇస్రోను ఆశ్రయిస్తున్నాయని.. ఇస్రో ద్వారా దేశ ఖ్యాతి వర్ధిల్లుతోందన్నారు.

మరిన్ని విజయాలు సాధించాలి: జగన్‌

ప్రయోగం విజయవంతంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దీనిలో కీలకపాత్ర పోషించిన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.

మరో ఘనత సాధించింది: చంద్రబాబు

పీఎస్‌ఎల్‌వీ-సీ51 విజయంతో ఇస్రో మరో ఘనత సాధించిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాభినందనలు తెలిపారు. ఈ విజయంతో అంతరిక్ష పరిశోధన రంగంలో ఇస్రో దేశ ప్రతిష్ఠను చాటిందన్నారు. 

పీఎస్‌ఎల్‌వీ సి-51 ద్వారా దేశీయ, ప్రైవేటు సంస్థలకు చెందిన 19 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని