Viral: మెహందీ వేడుకలో వధువు క్రీడాభిమానం..! 

పెళ్లికి ముందు జరిగే వేడుకల్లో మెహెందీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ వేడుకలో  అందంగా ముస్తాబయ్యేందుకు వధువులు ఎన్నో కొత్త ప్రయోగాలు  చేస్తుంటారు.  

Published : 12 Jul 2021 23:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెళ్లికి ముందు జరిగే వేడుకల్లో మెహందీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ వేడుకలో  అందంగా ముస్తాబయ్యేందుకు వధువులు ఎన్నో కొత్త ప్రయోగాలు  చేస్తుంటారు.  అయితే తాజాగా ఓ నవవధువు తన మెహందీ వేడుక సందర్భంగా చేసిన వినూత్న ఆలోచన నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వధువు పేరు గీత్‌. ఆమెకు  క్రీడలంటే మక్కువ. అయితే మెహందీ వేడుక సందర్భంగా తన క్రీడాభిమానాన్ని సైతం జీవితంలో చెరగని జ్ఞాపకంగా మిగుల్చుకోవాలని ఆమె భావించింది. అందుకోసం.. తన ఎడమ చేతిపై ప్రఖ్యాత ఐపీఎల్‌ క్రికెట్‌ జట్టు ముంబయి ఇండియన్స్‌, కుడి చేతిపై ఫుట్‌బాల్‌ క్లబ్‌ మాంఛెస్టర్‌ యునైటెడ్‌ చిహ్నాలను ఆకర్షణీయమైన డిజైన్‌గా వేయించుకుంది. తాజాగా ఈ ఫొటోలను ముంబయి ఇండియన్స్‌ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేసింది. వధూవరులైన దేవవ్రత్‌, గీత్‌లకు శుభాకాంక్షలు తెలిపింది. ఇందులో మరో ఆసక్తికరమైన సంగతి ఏంటంటే.. గీత్‌ ముంబయి ఇండియన్స్‌ అభిమాని కాగా.. దేవవ్రత్‌ మాంఛెస్టర్‌ యునైటెడ్‌ అభిమాని. ఇలా ఇద్దరి అభిమాన జట్లకు గీత్‌ తన మెహందీ వేడుకలోనూ చోటు కల్పించింది. ఈ వినూత్నమైన మెహందీ డిజైన్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే ఈ ఫొటోను 3,61,000 మంది లైక్‌ చేశారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని