Viral Video: జబ్బు చేసిన బామ్మను హత్తుకున్న మూగజీవి!

మచ్చికైన జంతువులు మనుషులతో అనుబంధాన్ని ఏర్పరచుకుంటాయి. అవి ఎంతో కృతజ్ఞతతో వ్యవహరిస్తుంటాయి. రోజూ కాస్త తిండి పెడితే విశ్వాసంగా మెలగుతాయి. అందుకు

Updated : 29 Jun 2023 16:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మచ్చికైన జంతువులు మనుషులతో అనుబంధాన్ని ఏర్పరచుకుంటాయి. అవి ఎంతో కృతజ్ఞతతో వ్యవహరిస్తుంటాయి. రోజూ కాస్త తిండి పెడితే విశ్వాసంగా మెలగుతాయి. అందుకు నిదర్శనమే ఈ వీడియో.. ఓ ముసలావిడ రోజూ తన ఇంటికి వచ్చే కొండ ముచ్చు (గ్రే లంగూర్‌)కు తిండిపెట్టేది. ఆమెకు ఈ మధ్య జబ్బు చేసి మంచం పట్టింది. రోజూలాగే తినడానికి వచ్చిన కొండ ముచ్చు మంచం మీద ముసలావిడను చూసింది. అది ఏమనుకుందో ఏమో మంచంపై పడుకున్న ముసలామె మీదకు ఎక్కి గుండెలను హత్తుకుంది. దానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ముసలావిడ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని