
Updated : 25 Jul 2021 16:10 IST
Viral Video: వర్క్‌ఫ్రమ్ వెడ్డింగ్.. పెళ్లిపీటలపై ల్యాప్‌టాప్‌తో వరుడు
ఇంటర్నెట్‌డెస్క్: కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం, ప్రైవేటు కార్యాలయాల్లో సిబ్బంది వర్క్‌ఫ్రమ్ హోం చేస్తుండడం మనం చూస్తున్నాం. మరో గత్యంతరం లేక అలా చేయక తప్పని పరిస్థితి. కానీ, ఓ వ్యక్తి మాత్రం తన పెళ్లి వేడుకలోనూ ఆఫీస్ పని చేస్తూ, వర్క్‌ఫ్రమ్ వెడ్డింగ్ విధానానికి తెరలేపాడు. ఇదేంటి అనుకుంటున్నారా? మహరాష్ట్రలోని ఓ పెళ్లి మండపంలో పక్కనే వధువు కూర్చున్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా వరుడు ల్యాప్‌టాప్ ముందు పెట్టుకుని తన పనిలో నిమగ్నమయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
ఇవీ చదవండి
Tags :