Xiaomi 11T: షావోమీ సరికొత్త మోడల్‌ వచ్చేసింది.. ధరెంతంటే?

హైపర్ ఛార్జింగ్‌ టెక్నాలజీతో తీర్చిదిద్దిన ‘షావోమి 11టీ (Xiaomi 11T)’ 5జీ మొబైల్‌ ఇండియాలోకి వచ్చేసింది. ప్రముఖ ఈకామర్స్‌..

Published : 20 Jan 2022 01:54 IST

దిల్లీ: హైపర్ ఛార్జింగ్‌ టెక్నాలజీతో తీర్చిదిద్దిన ‘షావోమి 11టీ (Xiaomi 11T)’ 5జీ మొబైల్‌ ఇండియాలోకి వచ్చేసింది. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ద్వారా బుధవారం మధ్యాహ్నం నుంచి ఈ మొబైల్స్‌ అమ్మకాలు భారత్‌లో ప్రారంభమయ్యాయి. 6.67-అంగుళాల 120 హెర్జ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 120 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, స్నాప్ డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌, స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్‌, ట్రిపుల్ రియర్ కెమెరాలు దీనిలో ప్రత్యేకతలు. వెనుకవైపు 108 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5,000 ఎంహెచ్‌ బ్యాటరీతో వచ్చే ఈ మొబైల్‌.. ఆండ్రాయిడ్‌ 11 MIUI 12.5 పై రన్‌ అవుతుంది. కేవలం 17 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్‌ఛార్జ్‌ అవుతుందని కంపెనీ తెలిపింది.

ఇక షావోమి 11టీ ప్రో మోడల్‌ల్లో 8 జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.39,999గా ఉండగా, 8 జీబీ/256 జీబీ ధర రూ.41,999గా ఉంది. అలాగే 12 జీబీ ర్యామ్‌/256 జీబీ స్టోరేజ్‌ మోడల్‌ ధరను రూ.43,999గా షావోమీ నిర్ణయించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని