ప్రేమలో జిహాద్‌కు స్థానం లేదు: అశోక్‌ గహ్లోత్‌

దేశాన్ని విడదీసేందుకే భాజపా ‘లవ్‌జిహాద్‌’ అనే పదాన్ని సృష్టించిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాత్‌ శుక్రవారం అన్నారు. ప్రేమలో జిహాద్‌కు స్థానం లేదని ఆయన తెలిపారు.  ఈ మేరకు వరుస ట్వీట్లతో భాజపాపై విమర్శలు గుప్పించారు.

Published : 20 Nov 2020 15:46 IST

భాజపాపై విమర్శలు గుప్పించిన రాజస్థాన్‌ ముఖ్యమంత్రి

దిల్లీ: దేశాన్ని విడదీసేందుకే భాజపా ‘లవ్‌జిహాద్‌’ అనే పదాన్ని సృష్టించిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌  విమర్శించారు. ప్రేమలో జిహాద్‌కు స్థానం లేదని ఆయన తెలిపారు.  ఈ మేరకు వరుస ట్వీట్లతో భాజపాపై విరుచుకుపడ్డారు.  వివాహం అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశం. దీనికి వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకురావడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని ఆయన అన్నారు.  ఇటువంటి చట్టాలు ఏ న్యాయస్థానంలోనూ నిలబడవని పేర్కొన్నారు.  దేశంలో భాజపా ఒక రాజ్యాంగ విరుద్ధమైన వాతావరణాన్ని సృష్టిస్తోందన్నారు. మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు, సామాజిక సంఘర్షణలకు ఆజ్యం పోసేందుకు ప్రయత్నం చేస్తోందని గహ్లోత్‌‌ తన ట్వీట్లలో పేర్కొన్నారు.

భాజపా పాలిత ప్రాంతాలైన ఉత్తరప్రదేశ్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌లు లవ్‌జిహాద్‌కు వ్యతిరేకంగా కొత్త చట్టాలను తీసుకురావాలన్న యోచనలో ఉన్న నేపథ్యంలో గహ్లోత్‌‌ ఈ వరుస ట్వీట్లు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని