ప్రజా ఉద్యమంపై ఉక్కుపాదం:10మంది కాల్చివేత

మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రజా ఉద్యమంపై ఆ దేశ సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. యాంగూన్‌లో పోలీసులు జరిపిన కాల్పుల్లో 10 మంది పౌరులు మృతిచెందారు....

Updated : 13 Mar 2021 13:38 IST

యాంగూన్‌: మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రజా ఉద్యమంపై ఆ దేశ సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. ఐక్యరాజ్య సమితి వినతిని లెక్కచేయకుండా ఆందోళనకారులపై కాల్పులను కొనసాగిస్తోంది. యాంగూన్‌లో పోలీసులు జరిపిన కాల్పుల్లో 10 మంది పౌరులు మృతిచెందారు. వందలాది మంది గాయపడ్డారు. యాంగూన్‌ సహా ఇతర ప్రధాన నగరాల్లో రోడ్లెక్కిన ఆందోళనకారులపై బాష్పవాయు గోళాలు, జల ఫిరంగులు ప్రయోగించారు. నిరసనలో పట్టుబడిన వారిని అదుపులోకి తీసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని