
నవజాత శిశువు ఉసురు తీసిన కొవిడ్
అహ్మదాబాద్: కరోనా మహమ్మారి ఓ నవజాత శిశువు ఉసురు తీసింది. వైరస్‌తో పదిహేను రోజుల కిందట జన్మించిన ఆ శిశువు.. మృత్యువుతో పోరాడుతూ ఇవాళ తుదిశ్వాస విడిచింది. గుజరాత్‌లోని సూరత్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
సూరత్‌కు చెందిన ఓ కొవిడ్ బాధితురాలు ఏప్రిల్ 1న ఓ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లికి వైరస్ సోకివుండటంతో శిశువుకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో తల్లీబిడ్డలను మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పసిబిడ్డను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు రెమిడిసివిర్ ఇంజక్షన్ కూడా ఇచ్చారు. ఆపై సూరత్ మాజీ మేయర్ జగదీశ్ పటేల్ ప్లాస్మా దానం చేశారు. ఇంతలోనే పుట్టినప్పటి నుంచి మహమ్మారిపై అవిశ్రాంతంగా పోరాడుతున్న ఆ నవజాత శిశువు గురువారం రాత్రి కన్ను మూసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి
Advertisement