కరోనాకు 244 మంది వైద్యుల బలి: ఐఎంఏ

కొవిడ్‌పై పోరులో భాగంగా నిరంతరం శ్రమిస్తూ కరోనా బారిన పడిన రోగుల ప్రాణాలు కాపాడుతున్న వైద్యులు కూడా ఈ మహమ్మారి కాటుకు బలవుతున్నారు. కరోనా కారణంగా.....

Published : 18 May 2021 01:50 IST

దిల్లీ: కొవిడ్‌పై పోరులో భాగంగా నిరంతరం శ్రమిస్తూ కరోనా బారిన పడిన రోగుల ప్రాణాలు కాపాడుతున్న వైద్యులు కూడా ఈ మహమ్మారి కాటుకు బలవుతున్నారు. కరోనా కారణంగా గతేడాది దేశవ్యాప్తంగా 730 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. సెకండ్ వేవ్‌లోనూ ఈ మహమ్మారి వైద్యులపై పంజా విసురుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 244 మంది వైద్యులు కరోనా కారణంగా మరణించినట్లు భారత వైద్య సంఘం (ఐఎంఏ) వెల్లడించింది. అత్యధికంగా బిహార్‌లో 69 మంది, ఉత్తర్ ప్రదేశ్‌లో 34, దిల్లీలో 27, ఆంధ్రప్రదేశ్‌లో 21 మంది చొప్పున వైద్యులు కరోనా సెకండ్‌ వేవ్‌లో మృత్యువాతపడినట్లు ఐఎంఏ పేర్కొంది. మృతుల్లో 25 ఏళ్ల నుంచి 87 ఏళ్ల వయసుగల వైద్యులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని