2-DG ఔషధం: భారీ ఉత్పత్తికి సన్నాహాలు..!
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధిచేసిన 2డీజీ కొవిడ్ ఔషధం కరోనా చికిత్సలో సత్ఫలితాలిస్తున్న వేళ.. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా వాటి ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.
మరో నాలుగు సంస్థలకు అనుమతిచ్చే యోచనలో ప్రభుత్వం
దిల్లీ: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధిచేసిన 2డీజీ కొవిడ్ ఔషధం కరోనా చికిత్సలో సత్ఫలితాలిస్తున్న వేళ.. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా వాటి ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. 2 డీజీ ఔషధాల తయారీకి మరో మూడు, నాలుగు సంస్థలకు అనుమతివ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 2డీజీ ఔషధంపై కొవిడ్ బాధితులు, వారి కుటుంబసభ్యుల నుంచి సానుకూలత వ్యక్తమవుతుందని అధికారులు పేర్కొన్నారు. అయితే, వీటి వినియోగానికి అనుమతి ఉన్నప్పటికీ కొరత కారణంగా వాటిని పొందలేకపోతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు కేవలం పదివేల 2డీజీ ఔషధాలను మాత్రమే తయారీ సంస్థలు సరఫరా చేయడంతో వాటి ఉత్పత్తి మరింత పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పొడి రూపంలో ఉండే 2-డియాక్సీ-డి-గ్లూకోజ్ (2-డీజీ) ఔషధాన్ని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌తో కలిసి డీఆర్డీవో ఆధ్వర్యంలోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్’ (ఇన్మాస్) అభివృద్ధి చేసింది. ఆక్సిజన్ అవసరమైన కొవిడ్ బాధితులు త్వరగా కోలుకునేలా ఈ ఔషధం పనిచేస్తున్నట్లు డీఆర్డీఓ ప్రకటించింది. నీటిలో కలుపుకొని తాగేలా పౌడర్ రూపంలో ఉన్న ఈ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీజీసీఐ) ఇటీవల అత్యవసర వినియోగ అనుమతిని ఇచ్చింది. కొవిడ్ మహమ్మారిపై యావత్ దేశం పోరాటం చేస్తోన్న వేళ.. కొత్త ఆశాకిరణంలా 2-డీజీ ఔషధాన్ని డీఆర్డీవో అందుబాటులోకి తీసుకొచ్చిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్‌కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్‌కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్‌ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్‌ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్‌గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్