Farm laws: త్వరలో సాగుచట్టాలూ ఉపసంహరణ: రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ సాగుచట్టాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలు త్వరలోనే ఉపసంహరణ కానున్నాయని జోస్యం చెప్పారు......

Updated : 29 Oct 2021 20:44 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ సాగుచట్టాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలు త్వరలోనే ఉపసంహరణ కానున్నాయని జోస్యం చెప్పారు. ఈ మేరకు అన్నదాతలను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు​. దిల్లీ సరిహద్దులోని గాజీపుర్​లో బారికేడ్ల తొలగింపు ప్రక్రియను అధికారులు చేపట్టిన క్రమంలో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు.

‘ఇప్పటివరకు తాత్కాలిక బారికేడ్లను మాత్రమే తొలగించారు. త్వరలోనే మూడు సాగు చట్టాలు కూడా ఉపసంహరణ కానున్నాయి. అన్నదాతల సత్యాగ్రహం భేష్’ అంటూ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌ ప్రాధాన్యం సంతరించుకొంది. ఏడాదిగా మూతపడిన దిల్లీ- ఉత్తర్​ప్రదేశ్​ సరిహద్దును అధికారులు శుక్రవారం తెరిచారు. జాతీయ రహదారి- 9లోని సెక్టార్​ 2, 3 వద్ద ఉన్న బారికేడ్లను అధికారులు తొలగించారు. త్వరలోనే జాతీయ రహదారి 9పై రాకపోకలు ప్రారంభమవుతాయని డీసీపీ ప్రియాంక కశ్యప్ శుక్రవారం తెలిపారు.

రైతులకు మద్దతుగా వరుణ్‌ గాంధీ మరో ట్వీట్‌

నూతన సాగు చట్టాల విషయంలో రైతులకు మద్దతుగా నిలుస్తూ గత కొంతకాలంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ తాజాగా మరో ట్వీట్‌ చేశారు. కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీ లభించనంతవరకూ మండీల్లో రైతులు దోపిడీకి గురవుతూనే ఉంటారని.. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ట్వీట్‌ చేశారు. వ్యవసాయ అంశాల్లో కేంద్రం వైఖరిపై వరుణ్‌ గాంధీ పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందంటూ కొద్దిరోజుల క్రితమే ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని