JK: ఈ ఏడాది ఉగ్ర ఘటనల్లో 40మంది పౌరులు మృతి: కేంద్రం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఈ ఏడాది 40మంది పౌరులు మృతిచెందినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి.......

Updated : 27 Feb 2024 19:22 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఈ ఏడాది 40మంది పౌరులు మృతిచెందినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్‌ రాయ్‌ పార్లమెంట్‌లో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమధానం ఇచ్చారు. గత ఐదేళ్ల కాలంలో జమ్మూకశ్మీర్‌లో చోటుచేసుకున్న ఉగ్ర ఘటనల్లో 348 మంది సైనికులతో పాటు 195మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించారు. ఈ ఏడాది నవంబర్‌ 15 వరకు మొత్తం 40మంది మృతిచెందగా.. 72మంది గాయపడినట్టు తెలిపారు. ముష్కరులు జరిపిన దాడుల్లో 2017లో 40 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోగా.. 2018, 2019 సంవత్సరాల్లో 39 మంది చొప్పున, 2020లో 37 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వివరించారు. అలాగే, భద్రతా సిబ్బంది విషయానికి వస్తే.. 2017లో 80మంది మృతిచెందగా.. 2018లో 91మంది, 2019లో 80 మంది, 2020లో 62 మంది, 2021లో ఇప్పటివరకు 35మంది సైనికులు వీరమరణం పొందారని కేంద్ర మంత్రి వెల్లడించారు.

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని