Omicron: భారత్‌లో మరో ఒమిక్రాన్‌ కేసు

భారత్‌లో మరో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయికి చెందిన 33 ఏళ్ల వ్యక్తిలో ఈ వేరియంట్‌ను గుర్తించారు.

Updated : 04 Dec 2021 20:05 IST

ముంబయి: భారత్‌లో మరో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయికి చెందిన 33 ఏళ్ల వ్యక్తిలో ఈ వేరియంట్‌ను గుర్తించారు. అతడు గత నెల దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్‌, దిల్లీ మీదుగా ముంబయి చేరుకున్నాడు. కొవిడ్‌ పరీక్ష చేయగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ పాజిటివ్‌ వచ్చిందని ప్రభుత్వం వెల్లడించింది. అతడు ఇప్పటి వరకు ఎలాంటి కొవిడ్‌ వ్యాక్సినూ తీసుకోకపోవడం గమనార్హం.

గత నెల 24న అతడు ముంబయి చేరుకున్న తర్వాత అతడికి జ్వరం వచ్చింది. దీంతో పరీక్షలు చేయగా.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ బారిన పడినట్లు తాజాగా గుర్తించారు. అతడితో పాటు ప్రయాణించిన వారికి పరీక్షలుచేయగా వారందరికీ నెగటివ్‌గా తేలింది. తాజా కేసుతో కలిపి దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటికే కర్ణాటకలో ఇద్దరికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకినట్లు కేంద్రం వెల్లడించగా.. శనివారం గుజరాత్‌ రాష్ట్రంలోని జామ్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తిలో ఈ వేరియంట్‌ను గుర్తించారు. అతడు ఇటీవల జింబాబ్వే నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని