Tokyo: టోక్యోలో భూకంపం

జపాన్‌ రాజధాని టోక్యోలో ప్రకృతి మరోసారి ప్రళయ తాండవాన్ని ప్రదర్శించింది. గురువారం రాత్రి అక్కడ భూకంపం సంభవించగా..  రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.1గా ఉన్నట్లు మెట్రోలాజికల్‌ ఏజెన్సీ పేర్కొంది. టోక్యోకి తూర్పు దిక్కున 80 కిలోమీటర్ల లోతులో (48 మైళ్లలో) భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది.

Published : 07 Oct 2021 22:34 IST

టోక్యో: జపాన్‌ రాజధాని టోక్యోలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. తూర్పు టోక్యోలో 80 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూ ప్రకంపనలకు భవనాలు కదలినప్పటికీ.. ఎలాంటి ప్రాణ హానీ జరగలేదని అక్కడి అధికారులు తెలిపారు. అదే విధంగా సునామీ వచ్చే అవకాశాలు లేవన్నారు. ఇక జపాన్‌లో భూకంపం సంభవించడం ఈసంవత్సరంలో ఇది రెండోసారి. మార్చి నెలలో ఉత్తర జపాన్‌లోని మియాగి ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌ స్కేలుపై 7.0 తీవ్రతతో 54 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని