
Published : 14 Mar 2021 11:58 IST
మయన్మార్‌లో ఆగని విధ్వంసం: ఏడుగురి కాల్చివేత
యాంగూన్: మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. సైన్యం జరిపిన కాల్పుల్లో ఏడుగురు పౌరులు మరణించారు. మాండలేలలో నలుగురు, పీఐలో ఇద్దరు, యాంగూన్‌లో ఒక్కరిని సైనికులు కాల్చిచంపారు. సైనిక కాల్పుల్లో అనేక మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆందోళనలో గాయాలపాలైన వారితో మయన్మార్‌లోని ఆసుపత్రులు నిండిపోయాయి. ఇప్పటివరకు సైన్యం జరిపిన కాల్పుల్లో 70 మందికి పైగా ప్రజలు మరణించినట్లు ఐరాసకు చెందిన మానవహక్కుల నిపుణులు టామ్ ఆండ్రూస్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి
Tags :