భారత సైన్యంపై తప్పుడు ప్రచారం‌!

80,000 మందికి పైగా భారత సైనికులు సిక్‌లీవులకు దరఖాస్తులు చేసుకున్నారు.. అనే వార్తలు అసత్యాలని..

Published : 14 Sep 2020 11:26 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌, చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో వేల సంఖ్యలో భారతీయ సైనికులు సైనికులు సిక్‌లీవులపై వెళుతున్నారని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ‘‘లద్దాఖ్‌ వద్ద భారత-చైనా ఘర్షణలు, వాస్తవాధీన రేఖ వద్ద కాల్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో.. 45 సంవత్సరాల్లో తొలిసారిగా 80,000 మందికి పైగా భారత సైనికులు సిక్‌లీవులకు దరఖాస్తు చేసుకున్నారు’’ అంటూ వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఇవన్నీ అసత్యాలని ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) స్పష్టం చేసింది. ఈ కారణంగా భారతీయ సైనికులు ఎవరూ సెలవుకు దరఖాస్తు చేయలేదని సైనిక వర్గాలు కూడా స్పష్టం చేశాయి. ఈ విధమైన వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. భారతీయ భద్రతాదళ అధికారులు స్పష్టం చేశారు.

లద్దాఖ్‌ ప్రాంతంలోని భారత్‌-చైనా సరిహద్దుల వద్ద గల్వాన్‌ లోయలో.. జూన్‌లో జరిగిన వివాదంలో 20 మంది భారతీయ సైనికులు అమరులవటం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనలో భారీ సంఖ్యలో చైనా భద్రతాదళ సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసింది. అంతేకాకుండా, ఇటీవల భారత్‌, చైనా‌ సైన్యాల మధ్య ఇటీవల గాల్లోకి కాల్పుల సంఘటన చోటుచేసుకోవటంతో సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని