Published : 14/12/2020 02:04 IST

బెంగాల్‌లో కేంద్ర బలగాలని దింపాలి: భాజపా

కోల్‌కతా: బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు హింసాత్మక ఘటనల్ని ప్రోత్సహిస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయవర్గీయ ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ హింసకు తెరపడాలంటే వెంటనే కేంద్ర బలగాలను దింపాలని ఆయన డిమాండు చేశారు. ఈ మేరకు ఆయన బీర్భూమ్‌లోని శాంతినికేతన్‌ వద్ద ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

‘వచ్చే ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాంటి హింసకు తావులేకుండా నిర్వహించాలని ఈసీని కోరాం. బెంగాల్‌లో పరిస్థితులు మమతా బెనర్జీ నుంచి చేజారిపోయాయని ఆమెకు తెలుసు. అందుకే ఆమె తిరిగి అధికారంలోకి రావడానికి హింసకు తెరలేపుతున్నారు. కాబట్టి రాష్ట్రంలో రాజకీయ హింసకు తెరదించడానికి కేంద్ర బలగాలను దింపాలని నేను ఈసీని కోరాను’ అని కైలాశ్‌ వెల్లడించారు. అదేవిధంగా డిసెంబర్‌ 22న విశ్వభారతి సెంట్రల్‌ వర్శిటీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాట్ల గురించి ఆయన వీసీ విద్యుత్‌ చక్రవర్తితో సమీక్షించారు. కాగా వర్శిటీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో డిసెంబర్‌ 24న ఛాన్సలర్‌ హోదాలో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. వర్శిటీని 1918 డిసెంబర్‌ 22న రవీంద్రనాథ్‌ఠాగూర్‌ స్థాపించారు. 

ఇటీవల బెంగాల్‌లో భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి భాజపా, టీఎంసీ నాయకుల మధ్య పరస్పర మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే ఆ ఘటనపై వివరణ కోరుతూ బెంగాల్‌ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ చేసింది. కాగా ఆ నోటీసులను మమతా బెనర్జీ ప్రభుత్వం తిరస్కరించడంతో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను కేంద్రానికి డిప్యూటేషన్‌పై వెనక్కి పిలుస్తూ ఆదేశించింది. 

ఇదీ చదవండి..

తెలంగాణ కాంగ్రెస్‌లో అధ్యక్షవేడి

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్