కోల్డ్‌వార్‌.. హాట్‌వార్‌.. ఏదీమాకొద్దు!

చైనా సైన్యం దూకుడుతో భారత్‌ సరిహద్దులో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న వేళ ఆ దేశ అధ్యక్షుడు శాంతి మంత్రం జపించారు. ఐరాస సర్వసభ్య...........

Published : 23 Sep 2020 01:11 IST

యుద్ధం కోరుకోవడంలేదన్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌

బీజింగ్‌: ఓవైపు భారత్‌ సరిహద్దులో చైనా బలగాల దూకుడుతో ఉద్రిక్త పరిస్థితులు, మరోవైపు అగ్రరాజ్యం అమెరికాతో కోల్డ్‌ వార్ కొనసాగుతున్న వేళ చైనా అధ్యక్షుడు శాంతి మంత్రం జపించారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో జిన్‌పింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము యుద్ధాన్ని కోరుకోవడంలేదని, కోల్డ్‌వార్‌, హాట్‌ వార్‌.. ఏదీ తమకు అవసరం లేదన్నారు. 75వ యూఎన్‌ సర్వసభ్య సమావేశం సందర్భంగా రికార్డు చేసిన వీడియో సందేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. దేశాల మధ్య బేధాభిప్రాయాలు ఉండటం సహజమేనని, అయితే, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. 

అభివృద్ధి చెందుతున్న దేశమైన చైనా.. శాంతియుత, సహకార సంబంధమైన అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.  తమ దేశం ఎప్పటికీ విస్తరణ, ఆధిపత్యాన్ని కోరుకోదని చెప్పారు. ఇతర దేశాలతో తమకు ఉన్న విభేదాలను తగ్గించుకుంటామని, సంభాషణలు, చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకుంటామన్నారు. ఐక్య రాజ్యసమితి సర్వసభ్య సమావేశం ఈ రోజు ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో ఆయా దేశాల అధినేతలు ఈ సమావేశానికి వర్చువల్‌ పద్ధతిలోనే తమ సందేశాలను పంపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని