ఆ సమావేశమే శ్వేతసౌధం కొంపముంచింది!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు వైరస్‌ సోకిన తర్వాత శ్వేతసౌధం వైరస్‌ వ్యాప్తికి కేంద్రంగా మారిన విషయం తెలిసిందే. అయితే, వారందరికీ కరోనా సోకడానికి కారణమైన సమావేశ వివరాలు అమెరికాలో అంటువ్యాధుల నివారణ నిపుణుడు..........

Published : 10 Oct 2020 14:17 IST

కరోనా వ్యాప్తిపై ఆంటోనీ ఫౌచీ ఆసక్తికర వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు వైరస్‌ సోకిన తర్వాత శ్వేతసౌధం వైరస్‌ వ్యాప్తికి కేంద్రంగా మారిన విషయం తెలిసిందే. అయితే, వారందరికీ కరోనా సోకడానికి కారణమైన సమావేశ వివరాలు అమెరికాలో అంటువ్యాధుల నివారణ నిపుణుడు, కరోనా కట్టడి కోసం ట్రంప్‌ ఏర్పాటు చేసిన కార్యదళంలో కీలక సభ్యుడు ఆంటోనీ ఫౌచీ తెలిపారు. 

సుప్రీం కోర్టు న్యాయమూర్తి రూత్ బాడర్ గిన్స్‌బర్గ్ వారసురాలిగా ఎమీ కోనీ బారెట్‌ను ప్రకటిస్తూ వైట్‌ హౌస్‌లో ట్రంప్‌ గత నెల 26న భారీ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమావేశమే వైరస్‌ వ్యాప్తికి కారణమైందని ఫౌచీ తెలిపారు. ఆ కార్యక్రమంలో ఎవరూ మాస్కులు ధరించలేదన్నారు. అందుకే వైరస్‌ చాలా మందికి సోకిందన్నారు. వైట్‌హౌస్‌లో కరోనా బారినపడ్డవారి వివరాలు చూస్తేనే ఇది స్పష్టమవుతోందన్నారు. 

శ్వేతసౌధంలో తొలుత ట్రంప్‌ సీనియర్‌ సలహాదారు హోప్‌ హిక్స్‌ కరోనా బారిన పడ్డట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఆమెకు కరోనా సోకినట్లు ట్రంప్‌ అక్టోబర్‌ 2న ప్రకటించారు. అంటే సమావేశం జరిగిన దాదాపు వారం తర్వాత ఆమెకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఆమె అధ్యక్షుడికి సన్నిహితంగా మెలగడంతో ట్రంప్‌ దంపతులు నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. వారికీ వైరస్‌ సోకినట్లు తేలింది. అనంతరం అధికార ప్రతినిధి కేలీ మెకనీ, సలహాదారులు స్టీఫెన్‌ మిల్లర్‌‌, నికోలస్‌ లూనా సహా ట్రంప్‌తో సన్నిహితంగా మెలిగిన దాదాపు 12 మంది ఉన్నతాధికారులు కొవిడ్‌ బారిన పడ్డారు.

ఇదీ చదవండి..
రెండో సంవాదం లేదు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని