భారీ విజయోత్సవానికి సిద్ధం కండి: ట్రంప్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ గెలుపు లాంఛనమే అని అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ రోజు సాధించిన విజయం అసాధారణమైనదని ఆయన వ్యాఖ్యానించారు.  అత్యద్భుతంగా మద్దతు తెలిపినందుకు అమెరికా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భారీ విజయోత్సవానికి సిద్ధమవ్వాలని...

Updated : 04 Nov 2020 15:05 IST

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ గెలుపు లాంఛనమే అని అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ రోజు సాధించిన విజయం అసాధారణమైనదని ఆయన వ్యాఖ్యానించారు.  అత్యద్భుతంగా మద్దతు తెలిపినందుకు అమెరికా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భారీ విజయోత్సవానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. శ్వేతసౌధంలోని దాదాపు 250 మంది పార్టీ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోందని, గెలుపు సంబరాలకు పార్టీ సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులను కోరారు.

 

‘‘ జార్జియా, నార్త్‌ కరోలైనా రాష్ట్రాల్లో గెలవనున్నాం. కీలకమైన పెన్సిల్వేనియాలోనూ భారీ ఆధిక్యంలో ఉన్నాం. ప్రజలు భారీగా తరలివచ్చి మా పార్టీకి మద్దతు తెలిపారు. అమెరికా ప్రజలకు కృతజ్ఞతలు’’ అని ట్రంప్‌ అన్నారు. నిజం చెప్పాలంటే మేం ఈ ఎన్నికల్లో విజయం సాధించాం’ అంటూ చాలా ఉత్సాహంగా మాట్లాడారు. అలాగే ఓట్ల కౌంటింగ్‌పై సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్లు ఆయన చెప్పారు. ‘మేం యూఎస్‌ సుప్రీం కోర్టుకు వెళ్తాం. ఇది అమెరికన్ ప్రజలకు జరిగిన మోసం. ఈ ఎన్నికల్లో మేం స్పష్టంగా గెలుపొందాం. ఓటింగ్ ఆగిపోవాలని నేను కోరుకుంటాను’ అని తన విజయంపై ధీమాను వ్యక్తం చేశారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని