ఫ్రెంచ్‌ పౌరులపై ఉగ్ర పంజా

నైజీరియాలో మరోసారి ఉగ్రదాడి చోటుచేసుకుంది. ఆదివారం ఆగురుగు ఫ్రెంచ్‌ పౌరులు సహా..

Published : 10 Aug 2020 10:14 IST

నియామి: నైజీరియాలో మరోసారి ఉగ్రదాడి చోటుచేసుకుంది. ఆదివారం ఆరుగురు ఫ్రెంచ్‌ పౌరులు సహా ఓ నైజీరిన్‌ గైడ్‌, మరో డ్రైవర్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటన దేశ రాజధాని నియామికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న కౌరెలోని జిరాఫి పార్కు సమీపంలో చోటుచేసుకుంది. బాధిత ఫ్రెంచ్‌ పౌరులంతా ఏటీసీఈడీ అనే అంతర్జాతీయ సహాయ బృందంలో పనిచేసేవారు. ఘటనపై ఏటీసీఈడీ స్పందించింది. ఉగ్రదాడిలో వారి బృందానికి చెందిన ఆరుగురు సభ్యులు మృతిచెందినట్లు వెల్లడించింది. అనంతరం ఈ ఘటనపై ఫ్రాన్స్‌‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రోన్‌ నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్‌ ఇసోఫోతో మాట్లాడినట్లు మాట్లాడారు. దాడిపై నైజీరియా అధ్యక్షుడు ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఉగ్రదాడిని పిరికి చర్యగా అభివర్ణించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై ఫ్రాన్స్‌తో కలిసి పోరాడుతున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని