వారు కరోనా పరీక్షలకు ఒప్పుకోవడం లేదు
హాథ్రస్ అత్యాచార, హత్య ఘటనలో మృతురాలి కుటుంబ సభ్యులు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షకు అంగీకరించడం లేదని అధికారులు వెల్లడించారు.
దిల్లీ: హాథ్రస్ అత్యాచార, హత్య ఘటనలో మృతురాలి కుటుంబ సభ్యులు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు అంగీకరించడం లేదని అధికారులు వెల్లడించారు. వారిలో దగ్గు, జ్వరంతో పాటు కొద్దిగా కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయన్న సమాచారం రావడంతో వైద్య బృందం ఈ పరీక్షలు నిర్వహించడానికి హాథ్రస్ చేరుకుంది.
‘ఆ ఘటన జరిగిన దగ్గరి నుంచి రాజకీయ నాయకులు, పాత్రికేయులు, పోలీసులు మృతురాలి కుటుంబం వద్దకు వెళ్లారు. వారిలో కొందరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే బాధిత కుటుంబ సభ్యుల్లో కొందరికి జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని మాకు ఫిర్యాదు అందింది. దాంతో వారిని పరీక్షించడానికి వైద్య బృందం వెళ్లగా, వారు నిరాకరించారు’ అని ఓ అధికారి మీడియాకు తెలిపారు.
హాథ్రస్ ఘటన అనంతరం బాధితురాలి మృతదేహానికి హడావుడిగా అర్ధరాత్రి సమయంలో అంత్యక్రియలు నిర్వహించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. కాగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వారిలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
పంజాబ్‌లో రైల్వేట్రాక్‌పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్‌లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్‌షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్‌లో చిత్రహింసలు
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు
లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్‌లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్‌కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్‌లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్‌లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్‌మాడ్‌లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?