మొన్న యాప్స్‌.. నేడు చైనీస్‌కి ఎసరు

గల్వాన్‌ ఘటన తర్వాత చైనాకు భారత్‌ వరుసగా షాక్‌లిస్తోంది. ఇప్పటికే చైనాకు చెందిన 59 యాప్స్‌ను నిషేధిస్తూ...

Updated : 06 Aug 2020 13:23 IST

చైనాకు వరుసగా షాకులిస్తున్న భారత్‌

దిల్లీ: గల్వాన్‌ ఘటన తర్వాత చైనాకు భారత్‌ వరుసగా షాక్‌లిస్తోంది. ఇప్పటికే చైనాకు చెందిన 59 యాప్స్‌ను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు చైనా కంపెనీలు తయారు చేసిన వస్తువులను బహిష్కరించాలని దేశ ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో దాదాపు 500 వస్తువుల జాబితాను కేంద్రం సిద్ధం చేసింది. అంతేకాకుండా పలు టెలికాం, రహదారుల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టుల్లో చైనా పెట్టుబడులను కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. 

అయితే గతవారం చైనా రాయబారి సన్‌ వీడూంగ్‌ స్పందిస్తూ.. భారత్‌కు చైనాతో ఎలాంటి వ్యూహాత్మక ముప్పు ఉండబోదని వ్యాఖ్యానించారు. అయినా ఇప్పటికీ సరిహద్దు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు చైనాకు మరో షాక్‌ ఇవ్వడానికి భారత్‌ సిద్ధమైంది. ఇప్పటి వరకు ఆర్థికంగా దెబ్బ కొట్టిన కేంద్రం.. వ్యూహాత్మకంగా చైనీస్‌ భాషను తొలగించాలని నిర్ణయించింది. పలు భారతీయ పాఠశాలల సిలబస్‌ నుంచి తొలిగించింది. చైనీస్‌ భాషను భారత్‌లో ప్రాచుర్యం కల్పించేందుకు ఏర్పాటైన ముంబయి వర్సిటీలోని కన్‌ఫ్యూసియస్‌ ఇనిస్టిట్యూట్‌పై కేంద్రం సమీక్షించనుంది. కొంత ఆర్థికంగానూ, మరికొంత ఇతర అంశాలకు సంబంధించి చైనాపై ఒత్తిడి తీసుకురాబోతున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. ఇదే కాకుండా భవిష్యత్తులో చైనాను కట్టడి చేసేందుకు  మరిన్ని చర్యలు చేపట్టే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని