వాద్రా కార్యాలయానికి ఐటీ అధికారులు

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు, వ్యాపార వేత్త రాబర్ట్‌ వాద్రా ఇంటికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోమవారం చేరుకున్నారు. బినామీ ఆస్తుల కేసులో వాంగ్మూలం సేకరించేందుకు తూర్పు దిల్లీలోని సుఖ్‌దేవ్‌......

Updated : 04 Jan 2021 16:39 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు, వ్యాపార వేత్త రాబర్ట్‌ వాద్రా ఇంటికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోమవారం చేరుకున్నారు. బినామీ ఆస్తుల కేసులో వాంగ్మూలం సేకరించేందుకు తూర్పు దిల్లీలోని సుఖ్‌దేవ్‌ విహార్‌లో ఉన్న వాద్రా కార్యాలయానికి వచ్చారు. రెండు బినామీ ఆస్తుల కేసులకు సంబంధించి గతంలో ఐటీ శాఖ సమన్లు జారీ చేయగా.. కరోనాను కారణంగా చూపి వాద్రా గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులే ఆయన నివాసానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.

రాబర్ట్‌ వాద్రాపై దేశ, విదేశాల్లో పలు కేసులు ఉన్నాయి. లండన్‌లోని 12 మిలియన్‌ పౌండ్లు విలువైన ఆస్తులు కొనుగోలు విషయంలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆరోపిస్తోంది. దీనిపై 2018న ఈడీ కేసు నమోదు చేసింది. అలాగే, రాజస్థాన్‌లోని బికనేర్‌లో వాద్రాకు చెందిన స్కైలైట్‌ హాస్పిటాలిటీ సంస్థ తక్కువ ధరకు 69.55 హెక్టార్ల భూమిని కొనుగోలు చేసి అధిక ధరకు అక్రమంగా అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే, గురుగ్రామ్‌‌లో సైతం 2.5 ఎకరాల భూమిని డీఎల్‌ఎఫ్‌కు అధిక ధరకు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో వాద్రా సహా అప్పటి హరియాణా ముఖ్యమంత్రి భూపీందర్‌ సింగ్‌ హుడాపై కేసు నమోదైంది. ఇవన్నీ రాజకీయంగా ప్రేరిపితమైన కేసులేనని వాద్రా ఆరోపిస్తున్నారు.

ఇవీ చదవండి..
రైతుల నిరసన.. రిలయన్స్ ప్రకటన
కొవాగ్జిన్‌ వైపు ప్రపంచ దేశాల చూపు..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని