పాక్‌ నుంచి ఎలాంటి సమాచారం లేదు

గూఢచర్యం కేసులో పాక్‌ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసులో న్యాయవాది నియామకం గురించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని భారత్‌ తెలిపింది...

Published : 07 Aug 2020 02:58 IST

దిల్లీ: గూఢచర్యం కేసులో పాక్‌ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసులో న్యాయవాది నియామకం గురించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని భారత్‌ తెలిపింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘కుల్‌భూషణ్ జాదవ్ కేసుకు సంబంధించి పాకిస్థాన్‌ నుంచి మాకు ఎలాంటి సమాచారం అందలేదు. పాక్‌ ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా న్యాయవాదిని నియమించుకునేందుకు అనుమతించాలి’’ అని శ్రీవాస్తవ తెలిపారు.

కొద్ది రోజుల క్రితం ఇస్లామాబాద్ హైకోర్టు జాదవ్ తరఫున న్యాయవాదిని నియమించేందుకు అనుమతిస్తూ తీర్పునిచ్చింది. దీనిపై భారత్‌కు సమాచారం అందించాలని పాక్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే సదరు న్యాయవాది పాకిస్థానీ అయి ఉండాలని షరతు విధించింది. అంతర్జాతీయ కోర్టు (ఐసీజే) ఆదేశాల మేరకు మిలటరీ కోర్టు ఇచ్చిన తీర్పును సివిల్‌ కోర్టులో సమీక్షించే అవకాశాన్ని తీసుకొస్తూ ఇటీవల పాక్‌ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. దీనిపై ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని