పాక్‌ దౌత్యవేత్తకు భారత్‌ సమన్లు

పాక్‌ హైకమిషన్ ఉన్నత స్థాయి అధికారులకు భారత్‌ సమన్లు జారీ చేసింది. పాక్‌లోని చారిత్రక కర్తార్‌పూర్‌ సాహిబ్‌ గురుద్వారా యాజమాన్యం మార్పు అంశాన్ని తీవ్రంగా ఖండించిన కేంద్ర విదేశాంగ శాఖ‌‌.. పాకిస్థాన్‌ హైకమిషన్‌ డిప్లొమాట్‌కు...........

Published : 06 Nov 2020 23:07 IST

దిల్లీ: పాక్‌ హైకమిషన్ ఉన్నత స్థాయి అధికారులకు భారత్‌ సమన్లు జారీ చేసింది. పాక్‌లోని చారిత్రక కర్తార్‌పూర్‌ సాహిబ్‌ గురుద్వారా యాజమాన్యం మార్పు అంశాన్ని తీవ్రంగా ఖండించిన కేంద్ర విదేశాంగ శాఖ‌‌.. పాకిస్థాన్‌ హైకమిషన్‌ అధికారికి శుక్రవారం సమన్లు ఇచ్చింది. దీంతో దిల్లీలోని సౌత్‌ బ్లాక్‌కు పాక్‌ దౌత్యవేత్త చేరుకొన్నారు. 

పాక్‌లోని కర్తార్‌పుర్‌ సాహిబ్‌ గురుద్వారా యాజమాన్య, నిర్వహణ బాధ్యతలను పాక్‌ ప్రభుత్వం ఏకపక్షంగా మార్చాలనుకుంటోంది. ప్రస్తుతం ఈ బాధ్యతలు చూస్తున్న పాకిస్థాన్‌ సిక్కు గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ నుంచి సిక్కుయేతర సంస్థ అయిన కాందిశీకుల ఆస్తుల ట్రస్టు బోర్డుకు బదలాయించాలని నిర్ణయించింది. దీనిపై భారత్‌లోని సిక్కు సంఘాలతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తీవ్రంగా స్పందించాయి. సిక్కుల మత విశ్వాసాలకు వ్యతిరేకంగా, మైనార్టీల హక్కులను హరించేలా పాక్‌ నిర్ణయం ఉందని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. సిక్కు సమాజంతో చర్చించకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారంటూ మండిపడుతున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని