Published : 23/09/2020 09:48 IST

‘మా వృద్ధికి భారతీయ అమెరికన్లే శక్తినిచ్చారు’

డెమోక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌

వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వృద్ధికి భారత సంతతికి చెందిన అమెరికావాసులు తమ కృషి, వ్యాపార నైపుణ్యాలతో ఎంతో శక్తినిచ్చారని డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో ఉన్న జో బైడెన్‌ అన్నారు. దేశంలో సాంస్కృతిక చైతన్యానికి దోహదం చేశారన్నారు. భారత అమెరికన్లు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

విజ్ఞానవంతుల్ని, నైపుణ్యం గల వారికి అవకాశాలు కల్పించే హెచ్‌-1బీ సహా ఇతర వలస విధానాల్లో నెలకొన్న చట్టపరమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బైడెన్‌ హామీ ఇచ్చారు. అమెరికా వృద్ధిలో భారతీయ అమెరికన్ల పాత్రను ప్రస్తావించిన ఆయన వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాల్ని నెలకొల్పారన్నారు. సిలికాన్‌ వ్యాలీకి పునాదులు వేశారన్నారు. అంతర్జాతీయంగా ఆదరణ పొందిన కీలక కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారని కొనియాడారు. 

ఈ సందర్భంగా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధానాలపై విరుచుకుపడ్డారు. హెచ్-1బీ వీసా, జాత్యహంకారం, వాతావరణ మార్పుల వంటి అంశాల్లో ట్రంప్‌ వ్యవహరించిన తీరు పరిస్థితుల్ని మరింత దిగజార్చిందన్నారు. దీంతో దేశంలోకి వలస వచ్చిన తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తు ఎలా ఉండనుందో అని ఆందోళన చెందుతున్నారన్నారు.

తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే భావితరాలకు మెరుగైన భవిష్యత్తును అందిస్తానని బైడెన్‌ హామీ ఇచ్చారు. మహమ్మారిని రూపుమాపి ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెడతామన్నారు. ప్రతిఒక్కరికీ విద్య, వైద్యం అందేలా చూస్తామన్నారు. అమెరికా విలువలు ఇనుమడింపజేసేలా వలస విధానాన్ని రూపొందించి ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదుతామన్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని