గిన్నిస్‌ రికార్డు వేగం.. మన భారతీయుడిదే!

గిన్నిస్‌ బుక్‌ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిన ఓ భారతీయుడి వేగానికి ప్రపంచమే ముక్కున వేలు వేసుకుంది.

Updated : 26 Sep 2020 17:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏదైనా అంశంలో గిన్నిస్‌ ప్రపంచ రికార్డులకెక్కిన వ్యక్తుల ప్రతిభ మనకు ఔరా అనిపిస్తుంది. అది మన దేశానికి చెందిన వారైతే మరింత ఆనందంగా ఉంటుంది. కాగా, ఇటీవల గిన్నిస్‌ బుక్‌ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిన ఓ భారతీయుడి వేగానికి ప్రపంచమే ముక్కున వేలు వేసుకుంది. దీనిలో జోరావర్‌ సింగ్‌ అనే వ్యక్తి రోలర్‌ స్కేట్స్‌ను ధరించి స్కిప్పింగ్‌ చేయటాన్ని మనం చూడొచ్చు. కేవలం 30 సెకన్ల వ్యవధిలో 147 సార్లు స్కిప్‌ చేసినట్టు ఆ సంస్థ నిర్ధారించింది.

దిల్లీకి చెందిన జోరావర్.. పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పపుడు డిస్కస్‌ త్రో ఆడేవాడట. అయితే ఓ పెద్ద గాయం వల్ల ఆయన దానికి దూరమైనా.. తాడాట ద్వారానే ఫిట్‌నెస్‌ సాధించాలని నిర్ణయించుకున్నాడట. ఇందుకు గాను సంవత్సరాల తరబడి రోజుకు నాలుగు గంటల చొప్పున సాధన చేశాడట. గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించడం పట్టలేనంత సంతోషంగా ఉందని వెల్లడించాడు. ఆ గిన్నిస్‌ రికార్డు వేగాన్ని ఈ వీడియోలో మీరూ చూడండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని