భారత్‌లో కరోనా పరీక్షలు @14 కోట్లు 

దేశంలో కరోనా విలయం కొనసాగుతున్న వేళ వైరస్‌ నిర్ధరణకు పరీక్షలు ఉద్ధృతంగా చేస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా నవంబరు 30 నాటికి 14 కోట్లకు పైగా పరీక్షలు చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ

Published : 01 Dec 2020 15:26 IST

న్యూదిల్లీ : దేశంలో కరోనా విలయం కొనసాగుతున్న వేళ వైరస్‌ నిర్ధరణ కోసం పరీక్షలు భారీగానే చేస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా నవంబరు 30 నాటికి 14 కోట్లకు పైగా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివరాలు వెల్లడించింది. ఇప్పటి వరకూ 14,13,49,298 పరీక్షలు చేసినట్లు తెలిపింది. నవంబరు 21వ తేదీకి 13 కోట్లుగా ఉన్న ఈ సంఖ్య తొమ్మిది రోజుల్లోనే గణనీయంగా పెరిగింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రెండో, మూడో వేవ్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు కరోనా పరీక్షల సంఖ్యను భారీగా పెంచాయి.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 31,118 కొత్త కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 94,62,810కి చేరింది. ప్రస్తుతం 4,35,603 యాక్టివ్‌ కేసులున్నాయి. 88,89,585 మంది వైరస్‌ బారిన పడి కోలుకున్నారు. వైరస్‌తో పోరాడుతూ మరో 482 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణించిన వారి సంఖ్య 1,37,621కి చేరింది. ఇదిలా ఉంటే జులై 7న దేశవ్యాప్తంగా కోటి కరోనా పరీక్షలు చేయగా ఐదు నెలల్లోనే ఆ సంఖ్య 14 కోట్లకు చేరడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని