దేశంలో తగ్గుతున్న కరోనా మరణాల రేటు!

దేశంలో కరోనా వైరస్‌ మరణాల రేటు తగ్గుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌ ప్రభావాన్ని గురించి కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషన్‌ మీడియాకు వెల్లడించారు.

Published : 08 Sep 2020 18:46 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ మరణాల రేటు తగ్గుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌ ప్రభావంపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌‌ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘దేశంలో కరోనా కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య తగ్గింది. ఆగస్టు మొదటి వారంలో మరణాల రేటు 2.15శాతం ఉండగా, ప్రస్తుతం 1.7కు చేరింది. దాదాపు 14 రాష్ట్రాలు సహా కేంద్రపాలిత ప్రాంతాల్లో 5వేల కన్నా తక్కువ కేసులు ఉన్నాయి. లక్షద్వీప్‌లో ఒక్క యాక్టివ్‌ కేసూ లేదు. దేశంలో మిలియన్‌ జనాభాలో 3,102 కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా పది లక్షల మందికి‌ కేవలం 53 కొవిడ్‌ మరణాలే సంభవిస్తున్నాయి. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే కొవిడ్‌ బాధితుల సంఖ్య భారత్‌లోనే అత్యల్పంగా ఉంది. దేశంలోని మొత్తం కేసుల్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, యూపీ, తమిళనాడు రాష్ట్రాల్లో 62శాతం యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో 70శాతం కొవిడ్‌ మరణాలు సంభవించాయి’ అని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని