ఆ టపాకాయలు అమ్మితే చర్యలు: చౌహాన్‌

దీపావళి టపాకాయల విషయంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవుడి లేదా దేవతల బొమ్మలు ఉండే టపాకాయలు అమ్మినా, ఉపయోగించినా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వెల్లడించారు. అలాంటి

Published : 05 Nov 2020 01:09 IST

భోపాల్‌: దీపావళి టపాకాయల విషయంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవుడి లేదా దేవతల బొమ్మలు ఉండే టపాకాయలు అమ్మినా, ఉపయోగించినా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వెల్లడించారు. అలాంటి బొమ్మలతో కూడిన టపాకాయలు ఉపయోగించి ప్రజల మత విశ్వాసాలను దెబ్బతీయొద్దని ప్రజలకు ఆయన సూచించారు. ఈ మేరకు చౌహాన్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘దేవతామూర్తుల బొమ్మలు ఉన్న టపాకాయలు అమ్మడం, ఉపయోగించడం చేయకూడదు. అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఆదేశించాం. ఆ విధమైన టపాకాయలు ఉపయోగించి ప్రజల మత విశ్వాసాలకు భంగం కలిగించకూడదు. ప్రజలకు అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే.. విదేశీ టపాకాయలకు స్వస్తి చెప్పి స్వదేశీ టపాకాయలతో వేడుకలు జరుపుకోవాలి’’ అని పేర్కొన్నారు. కాగా ఓ వైపు శీతాకాలం మొదలవడం.. మరోవైపు కరోనా నేపథ్యంలో ఈ ఏడాది టపాకాయలను నిషేధించే దిశగా దిల్లీ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని