రాజ్‌ఘాట్ వద్ద ప్రధాని మోదీ నివాళి
జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఘన నివాళులర్పించారు. ధిల్లీలోని రాజ్‌ఘాట్‌ను సందర్శించి పూలమాలతో అంజలి ఘటించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించాలన్న గాంధీజీ కలలను ‘ఆత్మనిర్భర భారత్’ ద్వారా సాకారం..
దిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఘన నివాళులర్పించారు. ధిల్లీలోని రాజ్‌ఘాట్‌ను సందర్శించి పూలమాలతో అంజలి ఘటించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించాలన్న గాంధీజీ కలలను ‘ఆత్మనిర్భర భారత్’ ద్వారా సాకారం చేస్తామన్నారు. గాంధీజీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని చెబుతూ ఆయన స్మృతులతో ఓ చిన్న వీడియోను ట్విటర్లో పోస్టు చేశారు.
‘‘ అక్టోబర్ 2 గాంధీజీ పుట్టిన రోజు మనందరికీ ఎంతో పవిత్రమైన, స్ఫూర్తిదాయకమైన రోజు. ఆయన ఆలోచనలు, ఆదర్శాలు ఇప్పటికీ బతికే ఉన్నాయి. నా జీవితమే నా సందేశం అని చెప్పారే తప్ప, తనని అనుసరించాలని ఆయన ఎప్పుడూ కోరుకోలేదు.కానీ, ఆయన జీవితం అందరికీ ఆదర్శమైంది.’’ అని మోదీ అన్నారు. ప్రపంచమంతా ఓ కుటుంబమని గాంధీజీ నమ్మేవారని మోదీ చెప్పారు. సత్యం, అహింస ఆయుధాలుగా ఉద్యమాలను నడిపించారని గుర్తు చేశారు. ‘‘ దేశం ఆరోగ్యంగా ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని దీని కోసం పరిశుభ్రత ముఖ్యమని గాంధీజీ చెప్పేవారు. గాంధీజీ ఆలోచనలు మాలో స్ఫూర్తి నింపాయి. అందుకే స్వచ్ఛభారత్ నినాదాన్ని అందుకున్నాం. సమాజాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ఆయన మాటలు మాకు మార్గనిర్దేశం చేశాయి. గాంధీజీ ప్రభావం మాపై ఎంతైనా ఉందని బలంగా నమ్ముతున్నాను.’’ అని మోదీ అన్నారు.
గాంధీ జీవితం నుంచి నేర్చుకోండి: రామ్‌నాథ్ కోవింద్
గాంధీజీ 151వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నివాళులర్పించారు. రాజ్‌ఘాట్‌ను సందర్శించి గాంధీజీ సేవలను గుర్తు చేసుకున్నారు. గాంధీజీ జీవితాన్ని అనుసరించి మన ప్రాధాన్యాలను ఎంచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన మాటలు ప్రజల గుండెల్లో నిత్యం మారుమోగాలని అన్నారు. |
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్‌ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్‌లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్‌కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్‌కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.