3 నెలల్లో 101 ఆన్‌లైన్‌ కార్యక్రమాల్లో మోదీ

మూడు నెలలు.. 101 కార్యక్రమాలు. సగటున రోజుకు ఒకటికి పైనే. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి నవంబరు మధ్య కాలంలో సాంకేతికతను వినియోగించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న ఆన్‌లైన్‌ కార్యక్రమాల సంఖ్య ఇది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 25 శాతం ఎక్కువే..........

Published : 09 Dec 2020 15:05 IST

గతేడాదితో పోలిస్తే 25% అధికం

దిల్లీ: మూడు నెలలు.. 101 కార్యక్రమాలు. సగటున రోజుకు ఒకటికి పైనే. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి నవంబరు మధ్య కాలంలో సాంకేతికతను వినియోగించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న ఆన్‌లైన్‌ కార్యక్రమాల సంఖ్య ఇది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 25 శాతం ఎక్కువే. మంగళవారం ప్రభుత్వ వర్గాలు ఈ వివరాలను వెల్లడించాయి. సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారితో మమేకం కావడానికి మోదీ సాంకేతికతను అధికంగా వినియోగించారని పేర్కొన్నాయి. వివిధ పథకాల ప్రారంభోత్సవాలు, ప్రాజెక్టుల శంకుస్థాపనలు, కొవిడ్‌-19 మహమ్మారిపై ముఖ్యమంత్రులతో సమావేశాలు, అంతర్జాతీయ నేతలతో శిఖరాగ్ర సదస్సులు, యువ వ్యాపారవేత్తలతో చర్చలు వంటి వివిధ కార్యక్రమాలు ఇందులో ఉన్నాయని తెలిపాయి. సాధారణంగానే మోదీ తీరిక లేకుండా గడుపుతారని, మహమ్మారి సమయంలో షెడ్యూల్‌ మరింత పెరిగిందని సంబంధిత అధికారి ఒకరు చెప్పారు. ఇవే కాకుండా, అంతర్గత సమావేశాలు కూడా గణనీయంగా పెరిగాయని ఆయన తెలిపారు. 

ఖతార్‌ రాజుకు మోదీ ఫోన్‌

ఖతార్‌ రాజు షేక్‌ తమిమ్‌ బిన్‌ హమద్‌ అల్‌-తానితో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఫోన్లో మాట్లాడారు. పెట్టుబడులు, ఇంధన భద్రత రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంపై ఇరువురు చర్చించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.  శిరోమణి అకాలీదళ్‌ అగ్రనేత ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌కు ప్రధాని మోదీ ఫోన్లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి..
ట్విటర్‌లో మోత మోగించిన ఐదు సినిమాలు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని