పక్షులు వచ్చేశాయ్‌.. నవశకానికి నాంది!

అత్యంత అధునాతన రఫేల్‌ యుద్ధవిమానాలు భారత వైమానిక అమ్ముల పొదిలో వచ్చి చేరాయి.  ఫ్రాన్స్‌ నుంచి 5 రఫేల్‌.......

Updated : 29 Jul 2020 16:45 IST

రఫేల్‌ ఫైటర్‌ జెట్స్‌ రాకపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హర్షం

దిల్లీ: అత్యంత అధునాతన రఫేల్‌ యుద్ధవిమానాలు భారత వైమానిక అమ్ముల పొదిలో వచ్చి చేరాయి.  ఫ్రాన్స్‌ నుంచి 5 రఫేల్‌ ఫైటర్‌ జెట్‌లు భారత్‌కు చేరుకోవడంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హర్షం వ్యక్తంచేశారు. రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు సురక్షితంగా చేరాయని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ జెట్‌ల రాక భారత సైనిక చరిత్రలో సరికొత్త శకానికి నాందిగా ఆయన అభివర్ణించారు. భారత వైమానిక దళం సామర్థ్యం మరింత పెరిగిందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఈ విమానాలు అందజేసిన ఫ్రాన్స్‌ ప్రభుత్వానికి రాజ్‌నాథ్‌ కృతజ్ఞతలు తెలిపారు. డసాల్ట్‌  ఏవియేషన్‌, ఫ్రెంచ్‌ కంపెనీలు సమయానికి విమానాలు చేరవేశాయని అభినందించారు.

ఈ విమానాలు మంచి పనితీరు కలిగి ఉన్నాయని రాజ్‌నాథ్‌ అన్నారు. అలాగే, దానిలోని ఆయుధాలు, రాడార్లు, ఇతర సెన్సార్లు, ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ సామర్థ్యాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవన్నారు. ఈ ఫైటర్‌జెట్‌ల రాకతో దేశానికి ఎదురయ్యే ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు దేశీయ వైమానిక సామర్థ్యం మరింత బలోపేతమైందని పేర్కొన్నారు. భారత వైమానిక దళం అవసరాలను పూర్తిగా తీర్చేందుకే వీటిని కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఈ జెట్‌ల కొనుగోళ్లపై వచ్చిన నిరాధార ఆరోపణలపై ఇప్పటికే సమాధానం చెప్పినట్టు గుర్తుచేశారు. ఈ మేరకు రఫేల్‌ ఫైటర్‌ జెట్‌లు అంబాలాలో సురక్షితంగా ల్యాండ్‌ అయిన వీడియోను ట్వీట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని