పంజాబ్‌లో 15 రోజుల రాత్రి కర్ఫ్యూ

కరోనా వైరస్‌ విజృంభణకు కళ్లెం వేయడమే లక్ష్యంగా పంజాబ్‌ ప్రభుత్వం కీలక చర్యలు ప్రకటించింది. రాష్ట్రంలో 15 రోజుల పాటు రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని సీఎం అమరీందర్‌సింగ్‌ అధికారులను ఆదేశించారు........

Published : 25 Nov 2020 15:53 IST

చండీగఢ్‌: కరోనా వైరస్‌ విజృంభణకు కళ్లెం వేయడమే లక్ష్యంగా పంజాబ్‌ ప్రభుత్వం కీలక చర్యలు ప్రకటించింది. రాష్ట్రంలో 15 రోజుల పాటు రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని సీఎం అమరీందర్‌సింగ్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో రాత్రి 10గంటల నుంచి ఉదయం 5గంల వరకు కర్ఫ్యూ అమలు చేయాలని సూచించారు. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే రెట్టింపు జరిమానాను (రూ.1000) విధించాలని ఆదేశించారు. డిసెంబర్‌ 1 నుంచి 15వ తేదీ వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయనున్నారు. కర్ఫ్యూ అమలులో ఉన్న రోజుల్లో నగరాలు/ పట్టణాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, వివాహ వేదికలు రాత్రి 9.30గంటలకే మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించకపోతే రెట్టింపు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. 

మరోవైపు, పంజాబ్‌లో మంగళవారం ఒక్కరోజే 22 మంది కొవిడ్‌తో మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 4653కి పెరిగింది. అలాగే, పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,47,665గా ఉంది. పంజాబ్‌ గవర్నర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీతో పాటు మరో ఆరుగురు నిన్న కొవిడ్‌ బారిన పడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,36,178 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 6834 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని