హాథ్రస్‌ కేసు: సిట్‌కు మరో 10 రోజుల గడువు

హాథ్రస్‌ ఘటనపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక సమర్పించేందుకు మరో పది రోజుల వ్యవధి లభించింది.

Updated : 07 Oct 2020 11:10 IST

లఖ్‌నవూ: హాథ్రస్‌ ఘటనపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నివేదిక సమర్పించేందుకు మరో పది రోజుల వ్యవధి లభించింది. ఈ ఘటనపై ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు తన నివేదికను నేడు సిట్‌ సమర్పించాల్సి ఉంది. అయితే సీఎం ఆదేశాల మేరకు వారికి మరో పది రోజుల వ్యవధి ఇచ్చినట్టు ఉన్నతాధికారులు తెలిపారు.

హాథ్రస్‌ గ్రామానికి చెందిన 19 ఏళ్ల దళిత యువతిపై సెప్టెంబర్‌ 14న జరిగిన దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధితురాలు దిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో చికిత్స్‌ పొందుతూ సెప్టెంబర్‌ 29న మరణించింది. ఆపై ఆమె మృతదేహాన్ని పోలీసులు.. కుటుంబ సభ్యులు లేకుండానే అదేరోజు అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించటం చర్చనీయాంశమైంది. ఈ మొత్తం ఘటనపై విచారణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం యూపీ హోం సెక్రటరీ భగవాన్‌ స్వరూప్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది.

సిట్‌ ఇదివరకు సమర్పించిన ప్రాథమిక నివేదికను అనుసరించి యోగి ఆదిత్యనాథ్‌.. హాథ్రస్‌ ఎస్పీ, డిఎస్పీ తదితర పోలీసు అధికారులను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ కేసుతో సంబంధమున్న పోలీసు అధికారులు, బాధితురాలి కుటుంబ సభ్యులకు పాలీగ్రాఫ్‌, నార్కో పరీక్షలను నిర్వహించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని