Updated : 13/11/2020 13:43 IST

‘చీకటి నుంచి వెలుతురు దిశగా సాగుతున్నాం’

ఆస్ట్రేలియా ప్రధాని దీపావళి ప్రత్యేక సందేశం

మెల్‌బోర్న్‌: దీపావళి పర్వదినం సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పటిలా కాకుండా ఈసారి జరపుకొనే పండుగకు ప్రత్యేకత ఉందన్నారు. ఈ పండుగ విశిష్టత సూచించేట్లుగా ప్రస్తుతం యావత్తు ప్రపంచం చీకటి రోజుల నుంచి వెలుతురులోకి ప్రవేశిస్తోందని గుర్తుచేశారు. పరోక్షంగా కరోనా వ్యాప్తి, వ్యాక్సిన్ అభివృద్ధిని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శుక్రవారం వీడియో ద్వారా తన సందేశం అందజేశారు. ఆస్ట్రేలియాలో దాదాపు 70 లక్షల మంది భారత సంతతి ప్రజలున్నారు. ఏటా ఆ దేశ పౌరసత్వం అత్యధికంగా పొందుతున్న వారిలో భారతీయులు కూడా ఉన్నారు. గత ఏడాది 28 వేల మంది భారతీయులు ఆస్ట్రేలియా పౌరులుగా మారారు.

‘‘చీకటిని పారదోలే ఈ పండుగ ప్రాశస్త్యాన్ని గురించి చాలా ఏళ్లుగా గుర్తుచేసుకుంటున్నాం. కానీ, ఎప్పుడూ అనుభవపూర్వకంగా తెలుసుకోలేదు. ఈసారి దీపావళికి ప్రత్యేకత ఉంది. ప్రతీ దేశం కరోనా మహమ్మారి ప్రభావానికి గురైంది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది జీవనోపాధిని కోల్పోయి దుర్భల పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఇంతటి విపత్కాలంలోనూ ఒకరికొకరం అండగా నిలిచాం. మహమ్మారిపై పోరులో ముందున్న సిబ్బంది నుంచి స్ఫూర్తి పొందాం. ఈ ఏడాది పూర్తిగా చీకటిని చూశాం. కానీ, వెలుతురు క్రమంగా దాన్ని కమ్మేస్తోంది. ముందు మరింత ప్రకాశవంతమైన రోజులున్నాయి. దీపావళి జరుపుకుంటున్న ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు’’ అని మోరిసన్‌ తన సందేశాన్ని వినిపించారు. 

ఆస్ట్రేలియా ప్రతిపక్ష నేత ఆంటోనీ అల్బనీస్‌ సైతం ప్రజలకు దీపావళికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిర పరిస్థితుల నేపథ్యంలో దీపావళి ఇచ్చే సందేశం సరిగ్గా సరిపోతుందని గుర్తుచేశారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని