ఒకే రోజులో దేశంలో సగం మందికి పరీక్షలు!

యూరప్‌ సభ్య దేశం స్లొవేకియా సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రభావవంతమైన లాక్‌డౌన్‌ అవసరం లేకుండా కరోనా కేసులకు చెక్‌ పెట్టాలనే ఉద్దేశంతో.. ఒకే రోజులో దేశ జనాభాలో సగం మందికి టెస్టుల్ని నిర్వహించి ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయాన్ని ఓ అంతర్జాతీయ దినపత్రిక వెల్లడించింది. స్లొవేకియాలో మొత్తం

Published : 03 Nov 2020 00:51 IST

బ్రటిస్లావా: యూరప్‌ సభ్య దేశం స్లొవేకియా సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రభావవంతమైన లాక్‌డౌన్‌ అవసరం లేకుండా కరోనా కేసులకు చెక్‌ పెట్టాలనే ఉద్దేశంతో.. ఒకే రోజులో దేశ జనాభాలో సగం మందికి టెస్టుల్ని నిర్వహించి ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయాన్ని ఓ అంతర్జాతీయ దినపత్రిక వెల్లడించింది. స్లొవేకియాలో మొత్తం 5.5మిలియన్ల మంది జనాభా ఉండగా.. 10ఏళ్ల లోపు వారిని మినహాయించి అందరికీ పరీక్షలు నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా శనివారం ఒక్క రోజే జనాభాలో సగం అనగా 2.58మిలియన్ల మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఆ దేశ రక్షణ మంత్రి జరోస్లవ్ తెలిపారు. ‘‘పరీక్షించిన వారిలో 25వేల మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో క్వారంటైన్‌కు తరలించాం. ఈ కార్యక్రమంలో మొత్తం 40వేలకు పైగా వైద్య, భద్రతా, పోలీసు, కార్యనిర్వాహక సిబ్బంది పాల్గొన్నారు. పరీక్షలు ఉచితంగానే నిర్వహించాం. కానీ ఇందులో పాల్గొనేందుకు నిరాకరించిన వారిపై లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించనున్నట్లు’’ జరోస్లవ్‌ వెల్లడించారు. కాగా ఈ నిర్ణయం దేశంలో పలువురు నిపుణుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంది. ఈ పరీక్షలు పీసీఆర్‌ పరీక్షల కంటే తక్కువ కచ్చితమైనవని తప్పుడు ఫలితాలను ఇవ్వవచ్చని వారు అనుమానం వ్యక్తం చేశారు.

కాగా స్లొవేకియాలో ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 61వేలకు చేరింది. 219 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు వదిలారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని