మాస్కులు గుర్తు చేస్తూనే ఉన్నాయి: ఐరాస

ఏ దేశమూ కొవిడ్-19ను ఒంటరిగా ఎదుర్కోలేదని, దాన్ని తరిమికొట్టడానికి అంతర్జాతీయ స్థాయిలో భౌతిక దూరం సహకరించదని ఐరాస 75వ జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షుడు వోల్కాన్‌ బోజ్‌కిర్‌ అభిప్రాయపడ్డారు

Published : 16 Sep 2020 16:20 IST

 

న్యూయార్క్‌: ఏ దేశమూ కొవిడ్-19ను ఒంటరిగా ఎదుర్కోలేదని, దాన్ని తరిమికొట్టడానికి అంతర్జాతీయ స్థాయిలో భౌతిక దూరం సహకరించదని ఐరాస 75వ జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షుడు వోల్కాన్‌ బోజ్‌కిర్‌ అభిప్రాయపడ్డారు. సర్వసమ్మతమైన విధానాలతో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించవచ్చని ఆయన అన్నారు. బుధవారం ఐరాస‌ రాయబారులు, ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘గత ఆరునెలల కాలంలో ఐరాస 75వ సంవత్సరానికి సంబంధించిన అన్ని ప్రణాళికలు మారిపోయాయి. మనకు అంతకంటే ముఖ్యమైన ప్రాధాన్యాలు ఉన్నాయి. మనం అత్యంత తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నామని మన మాస్కులు గుర్తు చేస్తున్నాయి. అలాగే అవి మనం కలిసిఉన్నామని గుర్తు చేస్తున్నాయి. ఏ ఒక్క దేశం ఒంటరిగా  మహమ్మారిపై పోరాడలేదు. అంతర్జాతీయ స్థాయిలో భౌతిక దూరం అసలు పనిచేయదు. ఏకపక్షవాదం ఈ వైరస్‌ను మరింత బలోపేతం చేస్తుంది. ఈ సంక్షోభ సమయంలోనే బహుపాక్షిక విధానం, అంతర్జాతీయ సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ఉంది. అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయడం ద్వారానే ప్రపంచంలోని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది’ అని వోల్కాన్‌ అన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని