Jharkhand: నోరు కుట్టేసి.. కాళ్లూ చేతులూ కట్టేసి..

నోరు కుట్టి, కాళ్లూ చేతులూ కట్టేసి ఓ వృద్ధుడిని రైల్వే ట్రాక్‌పై పడేసిన అమానవీయ

Published : 17 Jul 2021 11:14 IST

ఝార్ఖండ్‌లోఅమానుషం

పలామూ: నోరు కుట్టి, కాళ్లూ చేతులూ కట్టేసి ఓ వృద్ధుడిని రైల్వే ట్రాక్‌పై పడేసిన అమానవీయ ఘటన ఝార్ఖండ్‌లో చోటుచేసుకుంది. ఆస్తి వివాదం నేపథ్యంలో బాధితుడి రెండో భార్య కొడుకే ఈ ఘోరానికి పాల్పడ్డాడు! పలామూ జిల్లాలోని భీతిహార్వాకు చెందిన భోలారామ్‌కు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ఆరుగురు పిల్లలుండగా, రెండో భార్యకు ఓ కొడుకు ఉన్నాడు. భోలారామ్‌ చెప్పులు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే రెండో భార్య కారణంగా కుటుంబంలో ఆస్తి వివాదం తలెత్తింది. ఈ విషయమై పలుమార్లు పంచాయితీ కూడా జరిగింది. అక్కడ జరిగిన నిర్ణయంతో సంతృప్తి చెందని రెండో భార్య కుమారుడు... మంగళవారం రాత్రి తన తండ్రి నోరు కుట్టి, కాళ్లూచేతులు కట్టేసి రైల్వే ట్రాక్‌పై పడేశాడు. అయితే ఆ సమయంలో అటుగా రైళ్లు రాలేదు. ఇంతలో గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకుని భోలారామ్‌ నోటి కుట్లు కత్తిరించారు. ఉంటారి రోడ్‌ ఠాణా పోలీసులు కుటుంబ సభ్యుల మధ్య రాజీ కుదిర్చినట్టు తెలిసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని