REX MK II: సరిహద్దుల రక్షణకు సరికొత్త చిట్టి

యుద్ధ క్షేత్రాల్లో గస్తీ తిరుగుతూ చొరబాటుదారులను గుర్తించి కాల్పులు జరిపే సామర్థ్యమున్న సరికొత్త సాయుధ రోబోను

Published : 14 Sep 2021 12:25 IST

సాయుధ యంత్రుడు రెక్స్‌ ఎంకే2ను ప్రదర్శించిన ఇజ్రాయెల్‌

లాడ్‌ (ఇజ్రాయెల్‌): యుద్ధ క్షేత్రాల్లో గస్తీ తిరుగుతూ చొరబాటుదారులను గుర్తించి కాల్పులు జరిపే సామర్థ్యమున్న సరికొత్త సాయుధ రోబోను ఇజ్రాయెల్‌ ఆవిష్కరించింది. దీనిని రిమోట్‌ కంట్రోల్‌ సహాయంతో నియంత్రించవచ్చు. నాలుగు చక్రాలతో కూడిన ఈ మానవ రహిత వాహనాన్ని ‘రెక్స్‌ ఎంకే2’ పేరుతో ఇజ్రాయెల్‌ ప్రభుత్వ సంస్థైన ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌ రూపొందించింది. సోమవారం ప్రదర్శించింది. మరోవైపు, రోబోలకు ప్రాణాంతకమైన నిర్ణయాలు తీసుకునే అధికారం కట్టబెట్టే దిశలో ఇది మరో ప్రమాదకర దశ అని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ‘‘రెక్స్‌ ఎంకే2ను ఎలక్ట్రానిక్‌ ట్యాబ్‌తో నిర్వహించవచ్చు. రెండు మెషీన్‌ గన్‌లను, కెమెరాలను, సెన్సర్లను అమర్చవచ్చు’’ అని కంపెనీ స్వతంత్ర వ్యవస్థల విభాగానికి చెందిన ఉన్నతాధికారి రనీ అవ్నీ చెప్పారు. జాగ్వార్‌ పేరుతో రూపొందించిన ఇలాంటి వాహనాన్నే ఇజ్రాయెల్‌ సైన్యం ప్రస్తుతం గాజా స్ట్రిప్‌ సరిహద్దుల్లో గస్తీకి ఉపయోగిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని