హఫీజ్‌ సయీద్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష

కరడుగట్టిన అంతర్జాతీయ ఉగ్రవాది, ముంబయి పేలుళ్ల కుట్రలో  ప్రధాన సూత్రధారి హఫీజ్‌ సయీద్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఉగ్రవాద దాడులకు సంబంధించిన రెండు కేసుల్లో పాక్‌ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు అతడికి పదేళ్ల పాటు శిక్ష విధించింది. ........

Updated : 20 Nov 2020 02:01 IST

ఇస్లామాబాద్‌‌: కరడుగట్టిన అంతర్జాతీయ ఉగ్రవాది, ముంబయి పేలుళ్ల కుట్రలో ప్రధాన సూత్రధారి హఫీజ్‌ సయీద్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఉగ్రవాద దాడులకు సంబంధించిన రెండు కేసుల్లో పాక్‌ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం అతడికి శిక్ష విధించింది. జమాత్‌ ఉల్‌ దవా (జేయూడీ) సంస్థ చీఫ్‌గా ఉన్న సయీద్‌ 2008 ముంబయి పేలుళ్ల వెనుక ప్రధాన సూత్రధారి. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందిస్తున్నారన్న కేసులో ఇప్పటికే 11 ఏళ్లు జైలు శిక్ష పడగా.. అతడు ప్రస్తుతం లాహోర్‌లోని ఓ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా హఫీజ్‌తో పాటు మరో నలుగురికి పాకిస్తాన్‌ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఉగ్ర సంస్థలకు నిధులు అందిస్తున్నారన్న ఆరోపణలపై అతడితో పాటు జేయూడీ సభ్యులపై పాక్‌ ఉగ్ర నిరోధక విభాగం దాదాపు 41 కేసులు పెట్టగా. వాటిల్లో రెండు కేసుల్లో గురువారం శిక్ష పడింది.

ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు ముందుండి అన్నీ చూసుకొనే జేయూడీ చీఫ్‌గా ఉన్న సయీద్‌.. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలోనూ ఉన్నాడు. అంతేకాకుండా అమెరికా అతడి తలపై 10 మిలియన్‌ డాలర్ల పారితోషికం ప్రకటించింది. 2008 ముంబయి పేలుళ్ల ఘటనలో 166 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది క్షతగాత్రులైన ఘటన యావత్‌ ప్రపంచాన్ని కలిచివేసిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని