కదం తొక్కిన బిహార్ రైతన్న!

దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతన్నలకు మద్దతుగా బిహార్‌ అన్నదాతలకు కదం తొక్కారు. రాష్ట్ర రాజధాని పట్నాలోని రాజభవన్‌కు ర్యాలీగా తరలివెళ్లారు. నూతన సాగు చట్టాలకు వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.........

Published : 29 Dec 2020 14:31 IST

పట్నా: దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతన్నలకు మద్దతుగా బిహార్‌ అన్నదాతలు కదం తొక్కారు. రాష్ట్ర రాజధాని పట్నాలోని రాజభవన్‌కు ర్యాలీగా తరలివెళ్లారు. నూతన సాగు చట్టాలకు వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రాజ్‌భవన్‌ వద్ద భారీ స్థాయిలో బలగాల్ని మోహరించారు. రహదారులపై భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారు. రైతులు వాటిని తోసుకుంటూ వెళ్లే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ‘అఖిల భారతీయ కిసాన్‌ సంఘర్ష్‌ సమన్వయ్‌ సమితి’ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. వాపక్ష పార్టీలకు చెందిన పలు రైతుల సంఘాలు కూడా ఇందులో పాల్గొన్నాయి.

మరోవైపు దిల్లీలో అన్నదాతల ఆందోళన 34వ రోజుకి చేరింది. సింఘు, టిక్రి, ఘాజిపూర్, చిల్లా సహా పలు దిల్లీ సరిహద్దుల నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఎముకలు కొరికే చలిలోనూ రైతన్నలు పట్టు వీడడం లేదు. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం కేంద్రంతో రైతు సంఘాల ఆరో దఫా చర్చలు జరపనున్నాయి. కేంద్రం ఇప్పటికే రైతు సంఘాలకు చర్చలకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. కొత్త సాగు చట్టాలు సహా అన్ని అంశాలపై చర్చిస్తామని కేంద్రం తెలిపింది. మరోవైపు రేపు సింఘు సరిహద్దు నుంచి ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించాలని ముందే నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి..

రైతులతో చర్చలు రేపు

పార్టీపై రజనీకాంత్‌ సంచలన ప్రకటన

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని