ఐసోలేషన్‌ నిబంధనలు అతిక్రమించిన ట్రంప్‌

కరోనా కట్టడికి మాస్కులు ధరించాలనే సూచనను పట్టించుకోని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చాలా సార్లు మాస్కు ధరించకుండా కనిపించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు

Published : 08 Oct 2020 14:12 IST

వాషింగ్టన్‌ : కరోనా కట్టడికి మాస్కులు ధరించాలనే సూచనను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పట్టించుకోవడంలేదు. తాజాగా ఆయన ఐసోలేషన్‌ నిబంధనలను అతిక్రమించారు. గత వారం కరోనా బారిన పడిన ట్రంప్‌ మూడు రోజులు సైనిక ఆసుపత్రిలో కరోనా చికిత్స పొంది సోమవారం వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. అక్కడే ఆయన ఐసోలేషన్‌లో ఉండి పాలన కొనసాగిస్తున్నారు. 

తాత్కాలిక కార్యాలయంలో విధులు నిర్వర్తించటానికి మంగళవారం నుంచే ట్రంప్‌ సుముఖత కనబరిచారు. దీంతో బుధవారం ఐసోలేషన్‌ నిబంధనలను అతిక్రమించి తన అధికారిక కార్యాలయానికి వెళ్లారు. దీనిపై విమర్శలు రావటంతో వైట్‌హౌస్‌ స్పందించింది. గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో ఏర్పడనున్న తుఫాను పరిస్థితులపై చర్చించేందుకే అధ్యక్షుడు కార్యాలయానికి వెళ్లినట్లు వివరణ ఇచ్చింది. ఇలా తరచూ ట్రంప్‌ కొవిడ్‌ నిబంధనలను అతిక్రమిస్తుండటంతో వైట్‌హౌస్‌ సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. ఇక్కడ పని చేసే వారిలో ఇప్పటికే చాలా మందికి కరోనా సోకింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని